ఫిక్సింగ్ ఆరోపణల్లో దోషిగా తేలిన శ్రీలంక మాజీ పేసర్ దిల్హార లోకుహెట్టిగే
- 2017లో యూఏఈలో జరిగిన టీ20 టోర్నీలో ఫిక్సింగ్ ఆరోపణలు
- 2019లో వేటేసిన ఐసీసీ
- స్వతంత్ర ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన శ్రీలంక పేసర్
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీలంక జట్టుకు దూరమైన శ్రీలంక మాజీ పేసర్ దిల్హార లోకుహెట్టిగే సదరు కేసులో దోషిగా తేలాడు. అతడు ఫిక్సింగ్‌కు పాల్పడడం నిజమేనని స్వతంత్ర అవినీతి నిరోధక ట్రైబ్యునల్ పేర్కొంది. శ్రీలంక తరపున 9 వన్డేలు, రెండు టీ20లు ఆడిన దిల్హార.. 2017లో యూఏఈలో జరిగిన ఓ టీ20 టోర్నీలో ఓ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఈ సందర్భంగా అతడు ఫిక్సింగుకు పాల్పడ్డాడంటూ 2019లో ఐసీసీ అతడిపై వేటేసింది. తనపై వేసిన సస్పెన్షన్ వేటును సవాలు చేస్తూ దిల్హార స్వతంత్ర ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. విచారించిన ట్రైబ్యునల్ తాజాగా అతడిని దోషిగా తేల్చింది. దిల్హార ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని పేర్కొంది. మరోవైపు, విచారణ కొనసాగుతున్న సమయంలోనే టీ10 లీగులో ఆడేందుకు దిల్హార ప్రయత్నించడంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తరపున ఐసీసీ శిక్ష విధించింది. ఇప్పుడతడు దోషిగా తేలడంతో ఐసీసీ విధించిన శిక్షలు యథాతథంగా అమలవుతాయి.