జైలులో అర్ధరాత్రి లేచి పద్మజ కేకలు.. హడలిపోయిన అధికారులు
- మూఢభక్తితో కన్నకుమార్తెలను చంపుకున్న తల్లిదండ్రులు
- మదనపల్లి సబ్ జైలులో రిమాండ్
- మీడియా కంట పడకుండా ఈ తెల్లవారుజామున ఆసుపత్రికి తరలింపు
మూఢ భక్తితో కన్న కుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో మదనపల్లి సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితురాలు పద్మజ అర్ధరాత్రి వేళ జైలు అధికారులను హడలెత్తించింది. అందరూ నిద్రపోతున్న వేళ ఒక్కసారిగా లేచిన పద్మజ పెద్దగా కేకలు వేయడంతో జైలు అధికారులు, ఇతర ఖైదీలు హడలిపోయారు. అప్రమత్తమైన జైలు సూపరింటెండెంట్ రామకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వైద్యురాలు రాధికను పిలిపించి పరీక్షలు చేయించారు.
పరీక్షించిన వైద్యులు ఆమె మానసిక స్థితి సరిగా లేదని చెప్పడంతో పద్మజ, ఆమె భర్త పురుషోత్తంలను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎస్కార్ట్ కావాలంటూ పోలీసులకు సూపరింటెండెంట్ లేఖ రాశారు. అక్కడి నుంచి అనుమతి రావడంతో ఈ తెల్లవారుజామున ఎవరి కంటా పడకుండా ఇద్దరినీ ప్రత్యేక వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించారు.