ఎర్రకోట ఘటనపై దేశద్రోహం కింద కేసు నమోదు
- ఢిల్లీ ఘటనపై దర్యాప్తు వేగవంతం
- 20 రైతు సంఘాలకు నోటీసులు
- 44 మంది రైతులపై లుక్ అవుట్ నోటీసులు
గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధానిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం తాజాగా దేశద్రోహం కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు రిపబ్లిక్ డే నాడు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు రైతులు పోలీసు వలయాన్ని ఛేదించుకుని ఎర్రకోట చేరుకుని జెండా ఎగరవేశారు. ఈ క్రమంలో ఢిల్లీ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో వందలాదిమంది పోలీసులు గాయపడ్డారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం రైతులపై చర్యలకు సిద్ధమైంది. హింసకు కారణమైనందుకు న్యాయపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ 20 రైతు సంఘాల నాయకులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించారు. 44 మంది రైతులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.