విద్యార్థులకు అన్యాయం చేస్తే ఊరుకోం అంటూ ఉద్యమిస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నేతలను అభినందిస్తున్నా: నారా లోకేశ్

  • జీఓ 77 తీసుకువచ్చిన సర్కారు
  • వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న టీఎన్ఎస్ఎఫ్
  • సీఎం జగన్ పై లోకేశ్ ధ్వజం
  • బడుగులకు విద్యను దూరం చేస్తున్నారని ఆగ్రహం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీఎన్ఎస్ఎఫ్ నిరసనలపై స్పందించారు. విద్యార్థులకు అన్యాయం చేస్తే ఊరుకోం అంటూ ఉద్యమిస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నేతలను అభినందిస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రైవేటు కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేసి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేశాడంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుకు శరాఘాతంగా మారిన జీఓ 77ని రద్దు చేయాలని అడిగినందుకు అక్రమ కేసులు పెట్టి టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అరెస్ట్ చేశారని ఆరోపించారు. వైసీపీ సర్కారు జీవో 77ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం అని లోకేశ్ హెచ్చరించారు.


More Telugu News