అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరోసారి నిషేధం పొడిగించిన కేంద్రం

  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం
  • ఎప్పటికప్పుడు పొడిగిస్తున్న కేంద్రం
  • తాజాగా ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
  • డీజీసీఏ ప్రకటన
దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్ర నిషేధాజ్ఞలు విధించింది. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ ఈ నిషేధాన్ని పొడిగిస్తూ వస్తోంది. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే, ఈ నిషేధం అన్ని రకాల రవాణా విమాన సర్వీసులకు, డీజీసీఏ అనుమతి ఉన్న విమాన సర్వీసులకు వర్తించదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్ లాక్ ప్రక్రియలో భాగంగా అనేక రంగాల కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్న కేంద్రం అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై మాత్రం నిషేధం పొడిగిస్తోంది. అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో కొన్ని అంతర్జాతీయ షెడ్యూల్డ్ ఫ్లయిట్స్ ను అనుమతించే అవకాశాలు ఉన్నాయని డీజీసీఏ తెలిపింది. కాగా, కేంద్రం దేశీయ విమాన సర్వీసులపై ఆంక్షలు తొలగించిన సంగతి తెలిసిందే.


More Telugu News