కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీలు
  • 536 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 150 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 536 పాయింట్లు నష్టపోయి 46,874కి పడిపోయింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 13,817కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (6.16%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.47%), ఓఎన్జీసీ (1.17%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.12%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.72%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-3.65%), మారుతి సుజుకి (-3.56%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.60%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-2.25%).


More Telugu News