పెట్రోల్ బంక్ వద్ద వాహనంలో మంటలు.. పరుగులు తీసిన కస్టమర్లు.. తెగువ చూపిన ఉద్యోగిని!
- పెట్రోల్ బంకు వద్ద ఘటన
- ఓ మోటార్ రిక్షాలో మంటలు
- చెల్లాచెదురైన వాహనదారులు
- అగ్నిమాపక ట్యాంకుతో మంటలు ఆర్పేసిన మహిళ
- పెను నష్టాన్ని నివారించిన వైనం
ధైర్య సాహసాల్లోనూ అతివలు ఎవరికీ తీసిపోరు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఓ పెట్రోల్ బంకులో ఇంధనం కోసం వాహనదారులు వేచిచూస్తుండగా, ఓ మోటార్ రిక్షా వాహనం ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఆ వాహనదారుడు ఒక్కుదుటున దూకేసి దూరంగా జరిగాడు. పక్కనే ఉన్న ఇతర వాహనదారులు కూడా పరుగులు తీశారు.
కానీ, ఆ పెట్రోల్ పంప్ వద్ద విధుల్లో ఉన్న మహిళ మాత్రం ఎంతో నిబ్బరంతో వ్యవహరించింది. అక్కడే ఉన్న అగ్నిమాపక ట్యాంకు సాయంతో ఆ మంటలను ఆర్పివేసి, తీవ్ర విధ్వంసాన్ని అరికట్టింది. ఆ మంటలు పెట్రోల్ పంపుకు అంటుకుని ఉంటే జరిగే నష్టం అపారం. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇప్పుడా మహిళ తెగువకు సంబంధించిన వీడియోను ఓ ఐపీఎస్ అధికారి పంచుకున్నారు. ఆ మహిళా ఉద్యోగి ధైర్యానికి నెటిజన్లు సలాం చేస్తున్నారు.