'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ రగడ.. కస్సుమన్న బోనీకపూర్!
- ఎట్టకేలకు అక్టోబర్ 13న 'ఆర్ఆర్ఆర్' రిలీజ్
- సినిమా విడుదల తేదీపై నెలకొన్న వివాదం
- 'మైదాన్'ను అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్న బోనీ
- 'ఇది అన్యాయ'మంటూ మండిపాటు
ఇన్నాళ్లూ వాయిదాల మీద వాయిదాలు పడి.. కరోనా దెబ్బకు ఇంకోసారి వాయిదాపడి.. ఎట్టకేలకు 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇటీవలే రిలీజ్ డేట్ ను నిర్ణయించుకుంది. అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడీ చిత్రం విడుదల తేదీ పెద్ద వివాదంగా మారుతోంది. ఇప్పటికే తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించుకున్న కొన్ని బాలీవుడ్ చిత్రాల నిర్మాతలు దీనిపై కస్సుమంటున్నారు.
వాస్తవానికి 'ఆర్ఆర్ఆర్' తెలుగు సినిమానే అయినప్పటికీ, రాజమౌళి దీనిని అన్ని భాషల్లోనూ రూపొందిస్తున్నారు. గతంలో ఆయన చేసిన 'బాహుబలి' చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు కాబట్టి.. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' వస్తోందంటే భారతీయ చిత్ర పరిశ్రమ తన దృష్టిని ఈ చిత్రంపైనే పెట్టింది. ఆ చిత్రం విడుదల సమయంలో తమ చిత్రాలను విడుదల చేస్తే దారుణంగా నష్టపోవడం ఖాయమన్న ఉద్దేశంతో ఆయా చిత్రాల నిర్మాతలు వున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ కూడా స్పందిస్తూ 'ఇది అన్యాయమంటూ' ఎలుగెత్తారు. అజయ్ దేవగణ్ హీరోగా తాను నిర్మిస్తున్న 'మైదాన్' చిత్రాన్ని అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టు ఆరు నెల క్రితమే ప్రకటించానని, ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఇలా తమ సినిమా విడుదల సమయంలోనే రిలీజ్ కానుండడం చాలా అన్యాయమని బోనీ వాపోయారు.
కరోనాతో ఇప్పటికే దెబ్బతిన్న చిత్ర పరిశ్రమను అందరం కలసికట్టుగా కాపాడాల్సిన ప్రస్తుత సమయంలో 'ఆర్ఆర్ఆర్' నిర్మాతలు ఇలా రిలీజ్ డేట్ ప్రకటించడం ఏమీ బాగాలేదు, ఇది అన్యాయం' అన్నారాయన. మరి దీనిపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి!