బాలికలను దుస్తులపై నుంచి తాకితే లైంగిక వేధింపులు కాదన్న బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
- 12 ఏళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి వేధించినట్టు ఆరోపణలు
- ఇటీవల బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ లో విచారణ
- బాలిక శరీరాన్ని నేరుగా తాకలేదన్న హైకోర్టు
- హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన ఎన్సీడబ్ల్యూ
చిన్నారులపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ఇటీవల బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. బాలికలను దుస్తులపై నుంచి తాకితే లైంగిక వేధింపులు కాదంటూ ఓ కేసులో బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ అభిప్రాయపడింది. శరీర భాగాలను నేరుగా తాకితేనే పోక్సో చట్టం వర్తిస్తుందని పేర్కొంది.
12 ఏళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి లైంగికంగా వేధించాడన్న కేసులో హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో జనవరి 19న తీర్పు వచ్చింది. నేరుగా శరీరాన్ని తాకితేనే లైంగిక పరమైన ఉద్దేశంగా పరిగణించాల్సి ఉంటుందని జస్టిస్ పుష్ప గణేదివాలా వివరించారు.
దీనిపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్సీడబ్ల్యూ పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా నాగ్ పూర్ బెంచ్ తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పు సహేతుకంగా లేదని స్పష్టం చేసింది. వాదనలు విన్న తర్వాత ఆ తీర్పుపై స్టే ఇచ్చింది.