గవర్నర్‌తో 45 నిమిషాలు చర్చించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
- ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
- తాము తీసుకుంటున్న చర్యలను వివరించిన నిమ్మగడ్డ
- ఎన్నికలకు పూర్తిగా సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వినతి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమావేశమయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు గవర్నర్‌తో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఎన్నికలకు పూర్తిగా సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను ఎస్ఈసీ కోరారు. అధికారులపై చేపడుతున్న క్రమశిక్షణ చర్యల విషయంపై కూడా గవర్నర్‌కు ఆయన వివరించినట్లు తెలిసింది.
కాగా, కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తీరు, స్థానిక ఎన్నికల విషయంపై నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కాసేపట్లో ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్ సీఈవోలతో పాటు పలువురు అధికారులతో వర్చువల్ పద్ధతితో మాట్లాడనున్నారు. ఇందులో సీఎస్, డీజీపీ, వైద్య, ఆర్థిక, ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొంటారు.