ఢిల్లీ రైతు మృతికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజి విడుదల చేసిన పోలీసులు
- ఢిల్లీలో రైతు ఆందోళనలు
- ఐటీవో వద్ద రైతు మృతి
- పోలీసులే కారణమన్న రైతులు
- ట్రాక్టర్ పల్టీ కొట్టి మృతి చెందాడన్న పోలీసులు
- అందుకు రుజువుగా వీడియో ఫుటేజి విడుదల
ఢిల్లీలో ఇవాళ రైతుల ఆందోళన సందర్భంగా ఓ రైతు మరణించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఐటీవో వద్ద పోలీసుల బుల్లెట్ తగిలి అతడు మృతి చెందాడని రైతులు ఆరోపిస్తుండగా, ట్రాక్టర్ పైనుంచి పడి ఆ రైతు మృతి చెందాడని పోలీసులు అంటున్నారు. తాజాగా, ఢిల్లీ పోలీసులు ఆ రైతు మృతికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజి విడుదల చేశారు. ట్రాక్టర్ పల్టీ కొట్టిన కారణంగానే ఆ రైతు మరణించినట్టు ఆ వీడియో ఫుటేజి ద్వారా పోలీసులు వెల్లడించారు. అతివేగంగా బారికేడ్ల వైపు దూసుకొచ్చిన ఆ ట్రాక్టర్ బోల్తాపడినట్టు తేలింది. కాగా, ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ ముగియడంతో రైతులు తమ ట్రాక్టర్లతో సహా తిరిగి ఘజియాపూర్ చేరుకున్నారు.