వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నకిలీ ఉద్యమాలు చేస్తున్నారు: బండి సంజయ్

  • తెలంగాణ‌లో అవినీతి పాలన
  • కుటుంబ పాల‌న కొసాగుతోంది
  • బీఆర్ అంబేద్క‌ర్ విధానాలకు వ్యతిరేక పాల‌న‌
గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా తెలంగాణ‌లోని రాజ‌కీయ పార్టీల‌ నాయ‌కులు త‌మ పార్టీల కార్యాల‌యాల వ‌ద్ద‌ జాతీయ జెండాను ఎగుర‌వేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని  బీజేపీ కార్యాల‌యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ స‌ర్కారుపై, దేశంలో రైతుల ఉద్య‌మంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు పార్టీలు న‌కిలీ ఉద్యమాలు చేస్తున్నాయని బండి సంజ‌య్ చెప్పుకొచ్చారు.

కాగా, దేశ వ్యాప్తంగా ఈ రోజు రైతులు త‌మ ఆందోళ‌న‌ను కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ‌లో కుటుంబ పాల‌న కొసాగుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో అధికార పార్టీ పాలన కొనసాగిస్తోంద‌ని అన్నారు.  


More Telugu News