షబ్బీర్ అలీపై దాడి కేసులో అసదుద్దీన్ ఒవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్
- 2016లో మీర్ చౌక్ పరిధిలో షబ్బీర్ అలీపై దాడి
- కారులో ఉన్న షబ్బీర్ అలీపై చేయిచేసుకున్న వ్యక్తులు
- ఈ ఘటనకు బాధ్యుడిగా ఒవైసీపై క్రిమినల్ కేసు
- విచారణకు హాజరు కాని వైనం
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2016లో హైదరాబాద్ మీర్ చౌక్ పరిధిలో షబ్బీర్ అలీ కారును కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. కారులో ఉన్న షబ్బీర్ అలీపై దాడి చేశారు. ఈ ఘటనకు బాధ్యుడిగా అసదుద్దీన్ ఒవైసీని పేర్కొన్న పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసు విచారణకు ఆయన కోర్టుకు రాకపోవడంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఒవైసీపై ఈ కేసుకు సంబంధించిన ఆరోపణలే కాదు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కుమారుడిపై దాడి కేసులోనూ ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు కూడా విచారణ దశలో ఉంది.