సీఎం జగన్ కు స్ట్రాబెర్రీ పండ్లు బహూకరించిన అరకు ఎంపీ మాధవి

  • విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో స్ట్రాబెర్రీల సాగు
  • మరింతగా ప్రోత్సహించాలని సీఎంను కోరిన ఎంపీ మాధవి
  • ఈ ప్రాంతం స్ట్రాబెర్రీ పంటకు అనుకూలమని వెల్లడి
  • సానుకూలంగా స్పందించిన సీఎం జగన్!
దేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమని భావించే తేయాకు, కాఫీ తోటలను కూడా అరకులో సాగు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, విదేశాల్లో లభ్యమయ్యే స్ట్రాబెర్రీలను కూడా ఇప్పుడు అరకు రైతులు పండిస్తున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ రైతులు సాగు చేసిన తియ్యటి స్ట్రాబెర్రీ పండ్లను అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఇవాళ సీఎం జగన్ కు బహూకరించారు.

 విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో స్ట్రాబెర్రీ సాగును ప్రోత్సహించాలంటూ సీఎంను ఆమె కోరారు. ఏజెన్సీ పరిస్థితులు స్ట్రాబెర్రీలు పండించడానికి అనువుగా ఉంటాయని మాధవి వివరించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కూడా ఇది ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.


More Telugu News