ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన జగన్!
- వైసీపీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో భేటీ
- ప్రభుత్వం తరపున అనుసరించాల్సిన వైఖరిపై సమీక్ష
- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
ఏపీలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. దేశమంతా ఎన్నికలు జరుగుతుంటే... ఏపీలో మాత్రమే కరోనా అడ్డొచ్చిందా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలంటూ ఆదేశించింది. సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల షెడ్యూల్ ని కూడా మార్చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ అత్యవసర సమీక్షను నిర్వహించారు.
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ముఖ్య నేతలు, ఉన్నతాధికారులతో జగన్ భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు చెప్పిన అభిప్రాయాలపై చర్చించారు. ప్రభుత్వం తరపున అనుసరించాల్సిన వైఖరిపై సమీక్ష జరిపారు. ఈ భేటీకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.