సుప్రీం తీర్పు తర్వాత వేగం పెంచిన ఎస్ఈసీ.. కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ!
- పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
- ఎన్నికలకు సహకరించబోమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి
- ఎన్నికల నిర్వహణకు కేంద్ర సిబ్బందిని కేటాయించండి
పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వేగం పెంచారు. వెంటనే ఎన్నికల షెడ్యూల్ ని మార్చారు. మరోవైపు, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల నిర్వహణను జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పామని లేఖలో ఎస్ఈసీ తెలిపారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎన్నికలను నిర్వహించాలనుకుంటున్నామని... ఎన్నికల విధులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నామని చెప్పారు. అయితే, ఎన్నికలకు సహకరించబోమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంటున్నాయని... ఈ నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని కేటాయించాలని ఆయన కోరారు.
ఎన్నికలను నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర సిబ్బందిని ఇవ్వాలని నిమ్మగడ్డ కోరారు. చివరి ప్రయత్నంగా మాత్రమే ఎన్నికల విధులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటామని చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.