తెలంగాణ వచ్చాక పాటలు కూడా మారిపోయాయి: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి

  • పని చేసే చోట ఎన్నో సమస్యలు ఉంటాయి
  • అన్నింటికీ నన్ను అనాల్సిన అవసరం లేదు
  • గళం మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరం
తెలంగాణ ఉద్యమంలో తన గానంతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి రసమయి బాలకిషన్. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ తనపున ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు, రసమయి ఎప్పుడూ ఏదో వ్యాఖ్య చేస్తూ వార్తల్లో ఉంటూనే ఉంటారు. తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు దాని పరిధిలోనే బతకాలని... అక్కడ పని చేస్తూ, ఇంకో చోట కూడా చేస్తానంటే కుదరదని రసమయి అన్నారు. ప్రస్తుతం తాను ఉంటున్నది ఒక లిమిటెడ్ కంపెనీలో అని అనుకుంటున్నానని... పని చేసే చోట ఎన్నో సమస్యలు ఉంటాయని... జరిగే వాటన్నింటికీ తనను అనాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను ఎమ్మెల్యే అయ్యాక తనకు ఎందరో దూరమయ్యారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పాటలు కూడా మారిపోయాయని అన్నారు. గళం మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరమని చెప్పారు. తెలంగాణలో ప్రతి గాయకుడు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అయితే, ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.


More Telugu News