తిరుపతి ఉప ఎన్నికపై హైదరాబాద్‌లో జనసేన-బీజేపీ చర్చ!
- ఉప ఎన్నికలో అనుసరించబోయే వ్యూహంపై చర్చ
- ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకులను ఆహ్వానించాలని నిర్ణయం
- మరోసారి చర్చలు జరపనున్న ఇరు పార్టీలు
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక విషయంలో కలసికట్టుగా వెళ్లడానికి రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చలు జరుపుతామని ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేన నేతల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయని జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది.
హైదరాబాద్‌లో నిన్న రాత్రి మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికలో అనుసరించబోయే వ్యూహంపై చర్చించినట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకులను ఆహ్వానించడం వంటి విషయాలపై ఓ నిర్ణయానికి వచ్చారని తెలిపింది. మరోసారి చర్చలు జరపాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.