పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థిని వెనక్కి పంపిన అధికారులు
- ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉత్కంఠ
- నేటి నుంచి తొలి దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
- హిందూపురం మండలం తూముకుంటలో నామినేషన్ కోసం వచ్చిన అభ్యర్థి
- నామినేషన్ పత్రాలు రాలేదని చెప్పి పంపిన అధికారులు
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి తొలి దశ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికలు జరపడం సరికాదని ప్రభుత్వం అంటోంది. ఈ పరిస్థితుల మధ్య తొలి దశ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసేందుకు వచ్చిన ఓ అభ్యర్థికి వింత అనుభవం ఎదురైంది.
అనంతపురం జిల్లాలోని హిందూపురం మండలం తూముకుంట ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన షమీన్‌తాజ్ అనే అభ్యర్థిని అధికారులు వెనక్కి పంపారు. నామినేషన్ పత్రాలు రాలేదని ఆయనకు చెప్పారు.
తొలిదశ ఎన్నికలు జరగనున్న మరికొన్ని ప్రాంతాల్లోనూ నామినేషన్ల స్వీకరణపై ఉత్కంఠ నెలకొంది. గుంటూరులో పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అక్కడ మాత్రం నామినేషన్ పత్రాలు ఇప్పటికే పంచాయతీ కార్యాలయాలకు చేరుకున్నాయి. ఆయా కేంద్రాల వద్ద బాధ్యతలను నిర్వహించేందుకు అధికారులను కూడా నియమించారు.