బంగారు గనిలో రెండువారాలుగా చిక్కుకుపోయిన 22 మంది.. 11 మందిని రక్షించిన అధికారులు

  • చైనాలోని షాన్‌డాంగ్ బంగారు గనిలో పేలుడు
  • శిథిలాలతో మూసుకుపోయిన గని ద్వారం
  • వంద అడుగుల లోపల చిక్కుకుపోయిన కూలీలు
  • ఒకరి మృతి.. మిగతా వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
రెండు వారాల క్రితం చైనాలోని ఓ బంగారు గనిలో చిక్కుకుపోయిన 22 మందిలో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగతా వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. 14 రోజులుగా తిండిలేక, నీరసించి బలహీనంగా మారి అనారోగ్యం పాలైన వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 10న షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని క్విజియాలోని బంగారు గనిలో పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కూలీల్లో 22 మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. శిథిలాలతో గని మూసుకుపోవడంతో వంద అడుగుల లోతులో కూలీలు చిక్కుకుపోయారు.

సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూ సిబ్బంది కూలీలు చిక్కుకుపోయిన ప్రాంతానికి గాలి, వెలుతురు వెళ్లేలా డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. లోపల చిక్కుకుపోయిన 22 మందిలో 11 మందిని నిన్న సురక్షితంగా వెలికి తీయగా, మిగతా వారిలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. మిగతా 10 మందిని సిబ్బంది గుర్తించారు. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆహారం, మందులు పంపిస్తున్నారు.


More Telugu News