బాబ్రీ మసీదు కూల్చివేతపై కేంద్రమంతి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు

  • 6 డిసెంబరు 1992న చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దారు
  • బాబర్ వంటి వారు కూల్చివేతకు రామాలయాన్ని ఎంచుకున్నారు
  • దేశం ఆత్మ రామమందిరంలో ఉంటుందని వారికి తెలుసు
అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతతో ఓ చారిత్రక తప్పిదానికి చరమగీతం పాడినట్టు అయిందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ..  6 డిసెంబరు 1992 న ఓ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దారని అన్నారు.

బాబర్ వంటి ఆక్రమణదారులు దేశానికి వచ్చినప్పుడు రామాలయాన్ని కూల్చివేతకు ఎంచుకున్నారని అన్నారు. భారతదేశ ఆత్మ రామాలయంలోనే ఉంటుందన్న విషయం వారికి తెలుసని అందుకే వారా పనిచేశారని అన్నారు. రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదును కట్టారని, అయితే, 1992 డిసెంబరు 6న దానిని కూలగొట్టి జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దారని జవదేకర్ వివరించారు.


More Telugu News