రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు 300 ట్విట్టర్ ఖాతాలు సృష్టించిన పాకిస్థాన్

  • వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరసనలు
  • ట్రాక్టర్లతో ర్యాలీ
  • ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పాక్ యత్నం
  • పెద్ద సంఖ్యలో ట్విట్టర్ ఖాతాలతో దుష్ప్రచారం
తన కంటే ఎన్నో రెట్లు అధికంగా అభివృద్ధి పథంలోకి దూసుకెళుతున్న భారత్ ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ చేయని ప్రయత్నమంటూ లేదు! తాజాగా భారత్ లో రైతు నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలోనూ తన పన్నాగాలకు పదునుపెట్టింది. రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాక్ ఏకంగా 300కి పైగా ట్విట్టర్ ఖాతాలు సృష్టించింది. ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో అవాస్తవాలు వ్యాప్తి చేసేందుకు, దుష్ప్రచారం చేసేందుకు పాక్ ఈ ట్విట్టర్ ఖాతాలు తెరిచిందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఈ ఖాతాలన్నీ జనవరి 13 నుంచి 18వ తేదీ మధ్య సృష్టించినట్టు గుర్తించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఈ ట్విట్టర్ ఖాతాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన జాతీయ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ రైతుల డిమాండ్ చేస్తుండగా, ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని పాక్ భావిస్తోంది.


More Telugu News