వ్యాక్సిన్ వికటించి మృతి చెందిన ఆశావర్కర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం డిమాండ్ చేస్తే తప్పేంటి?: లోకేశ్
- గుంటూరులో విజయలక్ష్మి అనే ఆశావర్కర్ మృతి
- వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తీవ్ర అస్వస్థత
- స్పందించిన నారా లోకేశ్
- అన్నీ గమనిస్తున్నామని వ్యాఖ్యలు
గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విజయలక్ష్మి అనే ఆశా వర్కర్ తీవ్ర అస్వస్థతతో మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు. వ్యాక్సిన్ వికటించి మృతి చెందిన ఆశా వర్కర్ విజయలక్ష్మి కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం డిమాండ్ చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. ఆశా వర్కర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన పిల్లి మాణిక్యాలరావు ప్రజా ఉద్యమనేత, దళిత హక్కుల వీరుడు అని లోకేశ్ పేర్కొన్నారు.
అయితే పిల్లి మాణిక్యాలరావును నిలదీసిన పోలీసు ఉన్నతాధికారి యూనిఫాం తీసేసి వైసీపీ కండువా కప్పుకోవాలని సూచించారు. అన్ని అంశాలను గమనిస్తున్నామని, మీ అహంకారం లెక్క తేలుస్తామని మండిపడ్డారు. టీడీపీ నేతలపై వైసీపీ ఆఫీసర్ దాడి చేశాడని, ఇది అరాచకానికి పరాకాష్ట అని లోకేశ్ పేర్కొన్నారు.