కరోనా సాకుతో ఎన్నికలు వద్దంటున్న బొప్పరాజు 3 వేల మందితో కొడుకు పెళ్లి ఎలా జరిపించారు?: అయ్యన్న

  • స్థానిక ఎన్నికలు వద్దంటున్న బొప్పరాజు
  • ప్రభుత్వానికి వంతపాడుతున్నారన్న అయ్యన్న
  • కొడుకు పెళ్లి వేళ కరోనా గుర్తుకురాలేదా? అంటూ విమర్శలు
  • ఉద్యోగుల సమస్యలపై పోరాడాలంటూ హితవు
ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికల విధులు నిర్వర్తించలేమని, కరోనా వ్యాక్సిన్ ఇచ్చేంతవరకు పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అనడం పట్ల టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తగిన విధంగా స్పందించారు.

"ఉద్యోగుల జేఏసీ నేత బొప్పరాజు కరోనా సాకుతో స్థానిక ఎన్నికలు వద్దు అంటూ ప్రభుత్వం పాడిన పాట పాడుతున్నారు. కానీ నెలరోజుల కిందట తాడేపల్లి సీఎస్సార్ కల్యాణమండపంలో మీ కొడుకు పెళ్లిని మూడు వేల మందితో ఘనంగా జరుపుకున్నప్పుడు కరోనా గుర్తుకురాలేదా?" అని అయ్యన్న నిలదీశారు. ఉద్యోగ సంఘం నేతగా ఉద్యోగుల సమస్యలపై పోరాడాలే తప్ప, ప్రభుత్వం రాజకీయంగా చేసే పనులకు గుడ్డిగా మద్దతు తెలుపవద్దు అని బొప్పరాజుకు హితవు పలికారు.


More Telugu News