టైపింగ్ లో పొరపాటు జరిగింది... టీఎన్ఎస్ఎఫ్ నేతలపై అత్యాచారయత్నం కేసు నమోదు పట్ల గుంటూరు అర్బన్ ఎస్పీ వివరణ
- జీవో 77ని నిరసిస్తూ తెలుగునాడు విద్యార్థుల నిరసన
- సీఎం ఇంటిని ముట్టడించడంతో అరెస్ట్
- అత్యాచారయత్నం అంటూ రిమాండ్ రిపోర్టు
- ఆనక నాలిక్కరుచుకున్న పోలీసులు
- మరో కేసు మేటర్ ఈ రిపోర్టులోకి వచ్చిందని వెల్లడి
జీవో నెం.77ని నిరసిస్తూ సీఎం జగన్ నివాసం వద్ద ఆందోళనకు యత్నించిన తెలుగునాడు విద్యార్థి విభాగం (టీఎన్ఎస్ఎఫ్) నేతలపై పోలీసులు రిమాండ్ రిపోర్టులో అత్యాచారయత్నం కేసు అని పేర్కొనడం తెలిసిందే. దీనిపై గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఎఫ్ఐఆర్ లో అత్యాచారయత్నంకు సంబంధించిన సెక్షన్లేవీ నమోదు చేయలేదని, టైపింగ్ లో పొరపాటు వల్లే అత్యాచారయత్నం కేసు అని పేర్కొన్నారని స్పష్టం చేశారు.
రిమాండ్ రిపోర్టు టైప్ చేస్తున్నప్పుడు మరో కేసుకు సంబంధించిన మేటర్ ను టీఎన్ఎస్ఎఫ్ నేతల రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారని, ఆ తప్పిదం వల్లే గందగగోళం ఏర్పడిందని వివరించారు. తాము నమోదు చేసిన సెక్షన్లలో మాత్రం ఎలాంటి పొరబాటు లేదని, ఘటన ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన సెక్షన్లే నమోదు చేశామని ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు.