అందుకే నేను త‌మిళ‌నాడుకు వ‌చ్చాను: రాహుల్ గాంధీ

  • రోడ్ షోలో పాల్గొని మాట్లాడిన‌ రాహుల్ గాంధీ
  • త‌మిళ‌నాడుకు వ‌చ్చింది నా మ‌న్ కీ బాత్‌ను వినిపించ‌డానికి కాదు
  • ప్ర‌జ‌లు ఏం చేయాలో ఆదేశించ‌డానికో కాదు
  • ప్ర‌జ‌లు చెప్పేది విన‌డానికి త‌మిళ‌నాడుకు వ‌చ్చాను
త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తోన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఈ రోజు ఉద‌యం రోడ్ షోలో ఆయ‌న మాట్లాడుతూ... తాను త‌మిళ‌నాడుకు వ‌చ్చింది త‌న మ‌న్ కీ బాత్‌ను వినిపించ‌డానికి కాద‌ని అన్నారు. అలాగే, ప్ర‌జ‌లు ఏం చేయాలో ఆదేశించ‌డానికో కాదని చెప్పారు. తాను ప్ర‌జ‌లు చెప్పేది విన‌డానికి త‌మిళ‌నాడుకు వ‌చ్చాన‌ని, వారి స‌మ‌స్య‌లు విని, అర్థం చేసుకుని వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అన్నారు.

కాగా, ట్విట్ట‌ర్ లోనూ రాహుల్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నార‌ని, వారి స‌మ‌స్య‌ల గురించి ప‌ట్టించుకోకుండా ప్ర‌ధాని  మోదీ ప్రభుత్వం పన్నుల వసూళ్లలో బిజీగా ఉందని అన్నారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరిగిపోతున్నాయ‌ని ఆయ‌న పోస్ట్ చేశారు. దేశంలో రికార్డు స్థాయికి ఇంధన ధరలు చేరుతున్నాయ‌ని వివ‌రించి చెప్పారు.


More Telugu News