మానసికంగా దెబ్బ కొట్టడానికి ఆసీస్ ప్రయత్నించింది: అశ్విన్
- ఆసీస్ అభిమానులు, మీడియా ఆ పని చేసింది
- బ్రిస్బేన్‌కు రావడానికి టీమిండియా భయపడుతోందంటూ కథనాలు రాశారు
- బ్రిస్బేన్ లో సంచలన విజయం సాధించాం
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను మానసికంగా దెబ్బ కొట్టడానికి ఆసీస్ అభిమానులతో పాటు మీడియా ప్రయత్నించిందని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. తాజాగా ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ తో యూట్యూబ్ చానెల్‌లో అశ్విన్ మాట్లాడాడు. మ్యాచ్ జరగకముందు బ్రిస్బేన్‌కు రావడానికి టీమిండియా భయపడుతోందంటూ ఆస్ట్రేలియా మీడియా చేసిన కథనాలపై కూడా అశ్విన్ స్పందిస్తూ.. బ్రిస్బేన్ టెస్ట్ చారిత్రక విజయానికి సిడ్నీలోనే తొలి అడుగు పడిందని చెప్పాడు.
నాలుగో టెస్టుకు ముందు ఆడిన మ్యాచుల్లో టీమిండియా బాగా రాణించడంతో బ్రిస్బేన్‌లోనూ సంచలన విజయం సాధించినట్లు తెలిపాడు. కాగా, శ్రీధర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న మ్యాచ్‌లకు టీమిండియా కంటే ఎక్కువగా ఆస్ట్రేలియానే సిద్ధమైందని అన్నారు. నాలుగు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా నలుగురు ప్రధాన బౌలర్లనే కొనసాగించి పొరపాటు చేసిందని విమర్శించాడు.
తొలి టెస్టులో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైనప్పటికీ అనంతరం రెండు మ్యాచుల్లో గెలిచి సత్తా చాటిన విషయం తెలిసిందే. టీమిండియాలో సీనియర్లు లేనప్పటికీ, ఆటగాళ్లు గాయాలపాలైనప్పకీ యంగ్ జట్టు ఘన విజయం సాధించడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది.