భారత్ తో తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు ఎంపికపై మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ విమర్శలు
- ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు
- ఓపెనర్లుగా విఫలమైన క్రాలే, సిబ్లే
- ఇద్దరినీ భారత్ పర్యటనకు ఎంపిక చేయడాన్ని తప్పుబట్టిన వాన్
- బెయిర్ స్టోను పక్కనబెట్టడంపై విస్మయం
భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఇటీవల ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. తొలి రెండు టెస్టులకు ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టుపై మాజీ సారథి మైఖేల్ వాన్ పెదవి విరిచారు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో విఫలమైన ఓపెనర్లు జాక్ క్రాలే, డామ్ సిబ్లేలను భారత పర్యటనకు ఎంపిక చేయడాన్ని వాన్ తప్పుబట్టారు. పైగా ఫామ్ లో ఉన్న జానీ బెయిర్ స్టోను తొలి రెండు టెస్టులకు విశ్రాంతి పేరిట పక్కనబెట్టడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇంగ్లాండ్ టాప్-3 ఆటగాళ్లలో ఒకే ఒక్కడు ఉపఖండం పరిస్థితులకు తగినట్టుగా నియంత్రణతో ఆడతాడని, అలాంటి ఆటగాడిని పక్కనబెట్టడం చూస్తుంటే, ఈ ప్రపంచం నిజంగా పిచ్చిదేమో అనిపిస్తోందని ఇంగ్లాండ్ జట్టు ఎంపిక విధానాన్ని ప్రశ్నించారు. త్వరలోనే ఇంగ్లాండ్ జట్టు భారత్ రానుంది. ఫిబ్రవరి 5 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య చెన్నైలో తొలి టెస్టు జరగనుంది.