బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు: ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

  • సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ వ్యవహారం
  • ఏ1 నిందితురాలిగా అఖిలప్రియ
  • అఖిలప్రియను అరెస్ట్ చేసిన బోయిన్ పల్లి పోలీసులు
  • చంచల్ గూడ జైలులో రిమాండు
  • నిన్న బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఆమెకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కొద్దిసేపటి కింద అఖిలప్రియ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు చంచల్ గూడ జైలు వద్దకు చేరుకోవడంతో అక్కడ కొద్దిపాటి కోలాహలం కనిపించింది. బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా అఖిలప్రియకు కోర్టు కొన్ని షరతులు విధించింది. ప్రతి 15 రోజులకు ఒకసారి బోయిన్ పల్లి పోలీసుల ఎదుట హాజరవ్వాలని స్పష్టం చేసింది. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1 నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.


More Telugu News