క్షీణించిన లాలూ ఆరోగ్యం.. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలింపు
- శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న లాలూ
- కిడ్నీలు 25 శాతం మాత్రమే పని చేస్తున్న వైనం
- రాంచీలోని ఆసుపత్రిలో చికిత్స
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో, మెరుగైన వైద్యం అందించేందుకు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో లాలూ బాధ పడుతున్నారు. రాంచీలోని ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఆయన చికిత్స పొందారు. లాలూ భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ తో పాటు కుటుంబసభ్యులు ప్రస్తుతం రాంచీలోనే ఉన్నారు. లూలూతో పాటు వారు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.
మరోవైపు నిన్న తేజస్వి మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రికి మెరుగైన చికిత్స అవసరమని చెప్పారు. ఆయన పరిస్థితి బాగోలేదని అన్నారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రితో తాను మాట్లాడతానని చెప్పారు. ఇప్పటికే ఆయనకు హార్ట్ సర్జరీ జరిగిందని... మూత్రపిండాలు 25 శాతం వరకు మాత్రమే పని చేస్తున్నాయని తెలిపారు. న్యుమోనియాతో కూడా ఆయన బాధ పడుతున్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.