అనూహ్యంగా సైబరాబాద్ పోలీసులకు చిక్కిన హోసూరు ముత్తూట్ బ్యాంకు దోపిడీ ముఠా
- నిన్న ఉదయం బ్యాంకు తెరవగానే లూటీ
- తుపాకితో బెదిరించి రూ. 7 కోట్ల విలువైన బంగారం దోపిడీ
- నిందితుల నుంచి బంగారం, నగదు స్వాధీనం
తమిళనాడు హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో పట్టపగలే సిబ్బందిని బెదిరించి రూ. 7 కోట్ల విలువైన 25 కేజీలకు పైగా బంగారాన్ని ఎత్తుకెళ్లిన ముఠా అనూహ్యంగా సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. నిన్న ఉదయం బ్యాంకు తెరవగానే లోపలికి ప్రవేశించిన ఆరుగురు ముసుగు దొంగలు తుపాకితో సిబ్బందిని బెదిరించి 25 కేజీలకు పైగా బంగారం, లాకర్‌లోని రూ. 95 వేల నగదుతో ఉడాయించారు.
సమాచారం అందుకున్న పోలీసులు దుండగులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు కర్ణాటకకు పారిపోయి ఉంటారని అనుమానిస్తున్న పోలీసులు మూడు బృందాలను బెంగళూరుకు పంపారు. వారి కోసం గాలిస్తున్న సమయంలోనే ఈ ఉదయం సైబరాబాద్ పోలీసులకు ఈ ముఠా చిక్కింది. నిందితుల నుంచి బంగారు ఆభరాణలు, నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.