గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై నేడు ఎస్పీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు
- సమస్యల గురించి ప్రస్తావించిన వెంగయ్య
- అవమానించడంతో ఆత్మహత్య
- వెంగయ్య కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్న పవన్
- కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు
జనసేన కార్యకర్త వెంగయ్య ఆత్మహత్యకు కారణమయ్యారంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. నేడు ఒంగోలులో రెండో రోజూ పర్యటించనున్న పవన్ వెంగయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. 11 గంటలకు వెంగయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే రాంబాబుపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు. అనంతరం 12 గంటలకు మీడియాతో పవన్ మాట్లాడతారు.
ఇటీవల బెస్తవారిపేట మండలం సింగన్నపల్లి వచ్చిన ఎమ్మెల్యే రాంబాబు వాహనాన్ని అడ్డుకున్న వెంగయ్య సమస్యల గురించి ప్రస్తావించి, పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే వెంగయ్యను తీవ్రంగా అవమానించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నారు.