రామతీర్థం ఆలయం కోసం కృష్ణశిల రాతితో కొత్త విగ్రహాల తయారీ పూర్తి!
- ఇటీవల శ్రీరాముడి విగ్రహం ధ్వంసం
- ఆ విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలు
- తయారు చేసిన టీటీడీ శిలా శిల్ప తయారీ కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థంలో ఇటీవల శ్రీరాముడి విగ్రహం ధ్వంసమైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈ మేరకు టీటీడీకి విజయనగరం జిల్లా దేవాదాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేయడంతో కొత్త విగ్రహాలను తయారు చేశారు.
తిరుపతిలోని టీటీడీ శిలా శిల్ప తయారీ కేంద్రంలో వీటిని తయారు చేశారు. కృష్ణశిల రాతితో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడి విగ్రహాలను తయారు చేసిన శిల్పులు వీటిని కాసేపట్లో విజయనగరం జిల్లా దేవాదాయ శాఖ అధికారులకు అందించనున్నారు.