కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తమిళనాడు రాష్ట్ర మంత్రి
- కొవాగ్జిన్ వేయించుకున్న డాక్టర్ సి.విజయభాస్కర్
- ఓ వైద్యుడిగా, ఐఎంఏ సభ్యుడిగా వేయించుకుంటున్నట్లు ట్వీట్
- వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు సూచన
భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌ను తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.విజయభాస్కర్ ఈ రోజు ఉదయం 9 గంటలకు వేయించుకున్నారు. ఇటీవల తొలి దశ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్లు వేయిస్తోన్న విషయం తెలిసిందే. తాను కూడా వైద్యుడే కావడంతో విజయభాస్కర్ వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలు, ఆరోగ్య సిబ్బందిని ప్రోత్సహించారు.
అంతకు ముందు విజయభాస్కర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయంపై ట్వీట్ చేశారు. 'ఈ రోజు ఉదయం 9 గంటలకు నేను కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నాను. ఓ వైద్యుడిగా, ఐఎంఏ సభ్యుడిగా నేను ఈ వ్యాక్సిన్ వేయించుకుంటున్నాను. ఆరోగ్య కార్యకర్తల్లో కరోనా వ్యాక్సిన్‌పై నమ్మకాన్ని నింపడానికే ఈ పని చేస్తున్నాను. వ్యాక్సిన్ వేయించుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని అందరినీ కోరుతున్నాను' అని ఆయన పేర్కొన్నారు.