సోనూసూద్ కు హైకోర్టులో చుక్కెదురు

  • అక్రమంగా భవనాలు నిర్మించారని బీఎంసీ నోటీసులు
  • హైకోర్టును ఆశ్రయించిన సోనూసూద్
  • బీఎంసీనే సంప్రదించాలని హైకోర్టు సూచన
కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. అక్రమంగా భవనాలు నిర్మించారంటూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన నోటీసులపై సోనూసూద్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు చాలా ఆలస్యమయ్యారని, మీకున్న అవకాశాన్ని కోల్పోయారని జడ్జి అన్నారు. ఇప్పుడు బంతి మున్సిపల్ కార్పొరేషన్ చేతుల్లోకి వెళ్లిపోయిందని... మీరు వారిని సంప్రదించాలని సూచిస్తూ తీర్పును వెలువరించారు.

కేసు వివరాల్లోకి వెళ్తే, ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్ కు ఆరంతస్తుల భవనం ఉంది. గత ఏడాది అక్టోబర్ లో ఆయనకు బీఎంసీ నోటీసులు పంపించింది. నివాస సముదాయాన్ని హోటల్ గా మార్చి చట్ట విరుద్ధ పద్ధతిలో కమర్షియల్ లాభాలను పొందారని హైకోర్టులో బీఎంసీ వాదించింది.


More Telugu News