'కేటీఆర్ సీఎం' అనే ప్రచారం మా పార్టీ అంతర్గత విషయం: మంత్రి గంగుల కమలాకర్
- ఊపందుకున్న 'కేటీఆర్ సీఎం' ప్రచారం
- ప్రతిపక్షాల విమర్శలు
- స్పందించిన మంత్రి కమలాకర్
- సీఎం ఎవరో కేసీఆర్ నిర్ణయిస్తారని వెల్లడి
- తమ సీఎం అభ్యర్థితో బీజేపీకి సంబంధంలేదని స్పష్టీకరణ
గత కొంతకాలంగా టీఆర్ఎస్ వర్గాల్లో కేటీఆర్ భావి సీఎం అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. 'కేటీఆర్ సీఎం' అనే ప్రచారం తమ పార్టీ అంతర్గత విషయం అని స్పష్టం చేశారు. అయితే ఎవరిని సీఎం చేయాలన్నదానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
తమ సీఎం అభ్యర్థితో బీజేపీకి సంబంధం లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజలు తమకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని, ముఖ్యమంత్రికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కేటీఆర్ అని పేర్కొన్నారు. కేటీఆర్ వల్లే హైదరాబాదుకు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు.