ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు? మనవద్ద రాముడి ఆలయాలు లేవా?: కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
- అయోధ్యలో రామమందిర నిర్మాణం
- దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ
- విరాళాలు ఇవ్వొద్దని పిలుపునిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
- రాముడి పేరిట భిక్షం ఎత్తుకుంటున్నారని విమర్శలు
- కొత్త నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విరాళాలు సేకరించడం పట్ల జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు? మన వద్ద రాముడి ఆలయాలు లేవా? అని వ్యాఖ్యానించారు. అయోధ్య రాముడికి విరాళాలు ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చారు. రాముడి పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, కొత్త నాటకానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులమా? అని ప్రశ్నించిన ఆయన, తామంతా రాముని భక్తులమేనని అన్నారు.
అయోధ్య రామజన్మభూమికి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాటైన సంగతి తెలిసిందే. రూ.1,100 కోట్ల అంచనాలతో తలపెట్టిన రామమందిరం నిర్మాణానికి దేశంలో విరాళాలు సేకరిస్తున్నారు. జనవరి 15న ఈ విరాళాల సేకరణ ప్రారంభమైంది.