హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: మ‌ంత్రి విశ్వ‌రూప్

  • హైకోర్టు ఇచ్చిన‌ తీర్పుపై ఆందోళన లేదు
  • రాష్ట్రంలోని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు
  • ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యం  
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని హైకోర్టు ఇచ్చిన‌ ఆదేశాల‌పై ఏపీ మంత్రి విశ్వరూప్  స్పందించారు. ప్రకాశం జిల్లాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పారు. ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాలంటూ హైకోర్టు ఇచ్చిన‌ తీర్పుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, త‌మ‌ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ఆయ‌న వ్యాఖ్యానించారు.  త‌మకు రాజకీయాలు ముఖ్యం కాదని, గ‌తంలో జగన్ ఒంట‌రిగా పోరాటం చేసిన‌ప్పుడే ఎన్నికలకు భయపడలేదని, అటువంటప్పుడు ఇప్పుడెందుకు భ‌య‌ప‌డ‌తార‌ని ఆయ‌న అన్నారు.


More Telugu News