ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ఏపీ సర్కారు తెలిపింది: ఎస్ఈసీ
- ఎన్నికల నిర్వహణపై త్వరలో ఏపీ సీఎస్ తో భేటీ
- డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో కూడా
- ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తమకు అనుకూలంగా తీర్పు రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ఏపీ సర్కారు తెలిపిందని ఎస్ఈసీ ప్రకటించింది. ఎన్నికల నిర్వహణపై త్వరలో ఏపీ సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపింది. తాము ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది.
కాగా, హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ సర్కారుకి చెంపపెట్టు అని ఎస్ఈసీ తరఫు న్యాయవాది మీడియాతో అన్నారు. కరోనా సాకులు చెబుతూ ఎన్నికల నిర్వహణను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వేళ ఎన్నికలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. వ్యాక్సిన్ ను ప్రస్తుతం ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే వేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయాలంటే చాలా సమయం పడుతుందన్నారు. అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించకుండా ఉండలేరు కదా? అని ప్రశ్నించారు.