యువతిని గొంతు కోసి చంపిన కిరాతకుడికి యావజ్జీవ శిక్ష.. నాంపల్లి కోర్టు తీర్పు

  • ఆర్ట్స్ కళాశాల రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
  • ప్రేమను నిరాకరించిందన్న కారణంతో హత్య
  • రెండేళ్ల విచారణ తర్వాత నిన్న తుది తీర్పు
ప్రేమను నిరాకరించిందన్న కారణంతో యువతిని గొంతుకోసి హత్య చేసిన యువకుడికి నాంపల్లిలోని రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఓయూ ఇన్‌స్పెక్టర్ రమేశ్ నాయక్ కథనం ప్రకారం.. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ఆరెపల్లి వెంకట్ (25) ఆగస్టు 7, 2018న ఆర్ట్స్ కళాశాల రైల్వే స్టేషన్ పక్కనున్న పోలీస్ క్వార్టర్స్‌లో యువతిని బ్లేడుతో గొంతుకోసి హత్య చేశాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో ఉన్మాదిలా మారిపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు నిన్న తీర్పు వెల్లడించింది. నిందితుడు వెంకట్‌ను దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.


More Telugu News