వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గిన కేంద్రం.. రైతులకు ఆఫర్!
- పదో విడత చర్చలు పాక్షిక ఫలవంతం
- ఒకటి, రెండేళ్లపాటు అమలును నిలిపివేసేందుకు అంగీకారం
- 22 నాటి భేటీలో అంగీకారాన్ని తెలుపుతామన్న రైతు నేతలు
నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. వీటికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో నేడు పదో దఫా చర్చలు కొంత ఫలవంతంగా ముగిశాయి. నేటి చర్చల్లో రైతులకు కేంద్రం ఓ ఆఫర్‌ను ప్రకటించింది. నూతన సాగు చట్టాల అమలును ఒకటి, రెండేళ్లు నిలిపివేసేందుకు సిద్ధమని కేంద్రం చెప్పినట్టు రైతు సంఘాల ప్రతినిధి కవిత కూరగంటి మీడియాకు తెలిపారు.
తమ హామీపై నమ్మకం లేకుంటే కనుక సుప్రీంకోర్టులో అండర్ టేకింగ్ కూడా ఇస్తామని కేంద్రం చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అలాగే రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదన చేసినట్టు తెలిపారు. కేంద్రం తాజా ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు రేపు సింఘు సరిహద్దు వద్ద సమావేశమై చర్చించనున్నారు. 22న జరిగే భేటీలో తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారు.