కేటీఆర్‌ను సీఎం చేసే విషయంలో కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు: తలసాని
- ఆయన సీఎం అయితే తప్పేంటన్న తలసాని
- కేటీఆర్ సీఎం అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్న బాజిరెడ్డి
- సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడన్న బోధన్ ఎమ్మెల్యే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై టీఆర్ఎస్ నేత, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మాట్లాడుతూ.. తదుపరి ముఖ్యమంత్రి కేటీఆరేనంటూ జరుగుతున్న ప్రచారంపై కుండబద్దలుగొట్టారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, దానిపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారని అన్నారు.
ఆ పార్టీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడని, వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఆయన ఆధ్వర్యంలో జరగాలన్నదే తన కోరిక అని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు.