బ్రదర్ అనిల్ కుమార్ తో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికున్న అనుబంధాన్ని బహిర్గతం చేయాలి: వర్ల రామయ్య
- ప్రవీణ్ ఇంట్లో దొరికిన సాక్ష్యాలను బయటపెట్టాలి
- సజ్జల ముందుకు వెళ్తే సాక్ష్యాలు తారుమారవుతాయి
- ప్రవీణ్ కు ఉన్న రాజకీయ సంబంధాలను బయటపెట్టాలి
ఏపీలోని ఆలయాలపై తానే దాడులకు పాల్పడ్డానంటూ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఇంటిలో సీఐడీ సేకరించిన సాక్ష్యాలను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
ఆ ఆధారాలు సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వెళ్తే తారుమారవుతాయని అన్నారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ కేసులో తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రవీణ్ కున్న రాజకీయ సంబంధాలను తేల్చాలని అన్నారు. బ్రదర్ అనిల్ కుమార్ తో ఉన్న అనుబంధాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.