మూడు నెలల తర్వాత ప్రత్యక్షమైన చైనా వ్యాపారవేత్త జాక్ మా.. వీడియో ఇదిగో
- జాక్ అదృశ్యం అయ్యారంటూ ఇటీవల ప్రచారం
- తాజాగా టీచర్లతో నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జాక్ మా
- జాక్ మా ఏమైపోయారన్న సందేహాలకు తెర
చైనా వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా దాదాపు మూడు నెలల నుంచి కనిపించడం లేదన్న విషయం తెలిసిందే. చైనాలో చోటు చేసుకుంటోన్న పరిణామాల నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ఆయన బ్యాంకులు, ఆర్థిక సంస్కరణలపై గతంలో విమర్శలు చేశారు. దీంతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రభుత్వంతో వివాదం తలెత్తిన నేపథ్యంలో ఆయన కనపడకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
జాక్ అదృశ్యం అయ్యారంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆయన తాజాగా కనిపించారు. గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారు సాధించిన విజయాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. గతంలో ఆయన ఇంగ్లిష్ టీచర్‌గాను పనిచేశారు.
ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఆయన ఈ కార్యక్రమాన్ని దక్షిణ హైనాన్లోని సన్యాలో నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాక్ మా.. త్వరలోనే ఆ ప్రాంతానికి వచ్చి కలుస్తానని ప్రజలకు చెప్పారు. దీంతో జాక్ మా ఏమైపోయారంటూ వస్తోన్న ప్రచారానికి తెరపడింది.