ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు టీమిండియా ఎంపిక
- ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్
- తొలి రెండు టెస్టులకు టీమిండియా ఎంపిక
- కోహ్లీ కెప్టెన్సీలో 18 మందితో జట్టు ఎంపిక
- పృథ్వీ షాను తప్పించిన సెలెక్టర్లు
- గాయాలపాలైన ఆటగాళ్లకు విశ్రాంతి
ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం టీమిండియాను ఎంపిక చేశారు. మళ్లీ విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. కోహ్లీ ఇటీవల పితృత్వపు సెలవుపై ఆస్ట్రేలియా నుంచి భారత్ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ సందర్భంగా తొలి రెండు టెస్టులకు భారత జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఇవాళ సమావేశమయ్యారు. కోహ్లీ కెప్టెన్సీలో 18 మందితో జట్టును ప్రకటించారు.
హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లకు స్థానం లభించగా, ఆస్ట్రేలియాతో సిరీస్ లో దారుణంగా విఫలమైన యువ ఓపెనర్ పృథ్వీషాను జట్టు నుంచి తప్పించారు. గాయాల నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చారు. గాయాల నుంచి కోలుకోని ఉమేశ్ యాదవ్, షమీ, విహారి, జడేజాలకు సెలెక్టర్లు ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు విశ్రాంతి ఇచ్చారు.
కాగా, ఆంధ్రా క్రికెట్ జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు స్టాండ్ బై ఆటగాడిగా ఎంపికయ్యాడు.
టీమిండియా టెస్టు జట్టు ఇదే...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.
స్టాండ్ బై ఆటగాళ్లు...
కేఎస్ భరత్, అభిమన్యు ఈశ్వరన్, షాబాజ్ నదీమ్, రాహుల్ చహర్, ప్రియాంక్ పాంచల్.
నెట్ బౌలర్లు...
అంకిత్ రాజ్ పుత్, అవేశ్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరభ్ కుమార్.