భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఆర్థిక ప్యాకేజీ గురించి వెల్లడించిన జానెట్ యెల్లెన్
- ఆరంభం నుంచే పరుగులు తీసిస సూచీలు
- అన్ని రంగాల షేర్లకు సానుకూల వాతావరణం
- లాభాలు ఆర్జించిన బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ డీఎఫ్ సీ
జో బైడెన్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పదవిని ఖాయం చేసుకున్న జానెట్ యెల్లెన్ అమెరికాలో భారీ ఆర్థిక ప్యాకేజి దిశగా చేసిన వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఈ ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఆరంభం నుంచే సానుకూల దిశగా దూసుకుపోయాయి.
దాదాపు అన్ని రంగాల షేర్లు ఆరోగ్యకరమైన వాతావరణంలో ట్రేడయ్యాయి. చివరికి 834 పాయింట్ల మేర లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ 49,398 వద్ద ముగిసింది. 240 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 14,521 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.