ఆసియా దేశాలకు ఉచితంగా కొవాగ్జిన్... భారత్ సుహృద్భావ చర్య

  • భారత్ లో దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కొవాగ్జిన్
  • ఐసీఎంఆర్ తో కలిసి వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్
  • ఇటీవలే అత్యవసర అనుమతులు
  • పలు ఇతర దేశాలకు సాయం చేయాలని భారత్ నిర్ణయం
  • 8.1 లక్షల డోసుల వితరణ
భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను ఆసియాలోని మిత్ర దేశాలకు కూడా అందించాలని నిర్ణయించింది. మయన్మార్, మంగోలియా, ఒమన్, బహ్రెయిన్, ఫిలిప్పీన్స్, మాల్దీవులు, మారిషస్ దేశాలకు 8.1 లక్షల కొవాగ్జిన్ డోసులను ఉచితంగా పంపనుంది. ఇతర ప్రపంచ దేశాల పట్ల తన బాధ్యతగా భారత్ ఈ సుహృద్భావ చర్యకు పూనుకుంది.

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నిర్వహించిన ఓ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ కూడా దీనికి సమ్మతించినట్టు తెలిసింది. ఈ డోసులను జనవరి 22 నాటికి కేంద్ర విదేశాంగ శాఖకు అందించనున్నారు.


More Telugu News