డీజీపీ ఒక సీనియర్ అధికారి... ఆయన చెప్పేది అవాస్తవమైతే బీజేపీ నేతలు వివరణ ఇవ్వొచ్చు కదా!: బొత్స

  • ఆలయాలపై దాడుల ఘటనలపై డీజీపీ వ్యాఖ్యలు
  • తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీజేపీ
  • బీజేపీ నేతలు మతసామరస్యానికి విఘాతం కలిగిస్తున్నారన్న బొత్స
  • ఉనికిని చాటుకునే ప్రయత్నాలని విమర్శలు
ఆలయాలపై దాడుల పట్ల తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. బీజేపీ నేతలు తమ ఉనికి కాపాడుకునేందుకే మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. మత కల్లోలాలు, కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

డీజీపీ ఒక సీనియర్ పోలీసు అధికారి... ఆయన చెప్పేది అవాస్తవం అయితే బీజేపీ నేతలు వివరణ ఇవ్వొచ్చు కదా అని బొత్స హితవు పలికారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారితో బీజేపీకి సంబంధం లేకుంటే ధైర్యంగా చెప్పాలి అని స్పష్టం చేశారు. మీరు స్టేట్ మెంట్ రాసివ్వండి... మీరిచ్చిన స్టేట్ మెంట్ నే డీజీపీ చదువుతారు అన్నారు బొత్స సత్యనారాయణ.


More Telugu News