శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పోతుల సునీత

  • తాను ఖాళీ చేసిన స్థానానికి తానే నామినేషన్ దాఖలు
  • కొన్నాళ్ల కిందట టీడీపీని వీడి వైసీపీలో చేరిన సునీత
  • టీడీపీలో ఉన్నప్పుడే ఎమ్మెల్సీ అవకాశం
  • పదవికి రాజీనామా
  • ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్
  • సునీతకే అవకాశం ఇచ్చిన సీఎం జగన్
వైసీపీ మహిళా నేత పోతుల సునీత ఏపీ శాసనమండలిలో తాను ఖాళీ చేసిన స్థానానికి తానే నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆమె రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సునీత వెంట ఈ సందర్భంగా మంత్రులు ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు.

పోతుల సునీత కొంతకాలం కిందట టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు సునీతకు చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. పదవి నుంచి ఆమె తప్పుకోవడంతో శాసనమండలిలో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీనిపై నోటిఫికేషన్ విడుదల కావడంతో వైసీపీ తరఫున పోతుల సునీతకే అవకాశం ఇస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.


More Telugu News