ఆవుకి సీమంతం చేసిన హన్మకొండ దంపతులు
- కూతురు పుట్టలేదని బాధపడుతోన్న దంపతులు
- నలుగురూ కుమారులే పుట్టడంతో నిరాశ
- ఆవును కొనుక్కుని బిడ్డలా చూసుకుంటోన్న వైనం
ఆ దంపతులకు ఆడబిడ్డ అంటే చాలా ఇష్టం. అయితే, వారికి కూతురు పుట్టలేదు. నలుగురూ కుమారులే పుట్టడంతో కూతురు లేని లోటు వారిని వేధించింది. చివరకు ఓ ఆవును కొనుక్కుని దానిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. ఆ ఆవు కోసం ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని పెంచుతున్నారు.
ఆ ఆవు గర్భం దాల్చిందని వారికి ఇటీవలే తెలిసింది. దీంతో సొంత కూతురికి సీమంతం చేసినట్లు హిందూ సంప్రదాయం ప్రకారం ఆవుకి సీమంతం చేశారు. హన్మకొండ ఎస్‌బీహెచ్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి పీజేఆర్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోన్న పాశికంటి వీరేశం, శోభ దంపతులు ఆవుకి సీమంతం చేసి, సొంత కూతురికి సీమంతం చేసినట్లు భావించారు.
ఈ కార్యక్రమంలో ధరణి సాయి సేవా సంఘ్ కూడా పాలు పంచుకుంది. ఆవుకు గాజులతో పాటు పూలు, పండ్లు, చీర, కుంకుమ వంటివి పెట్టారు. వరంగల్ కాశీబుగ్గ రామాలయం పూజారి ఈ సీమంతం కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు.